Breaking

Friday, 11 December 2020

దేవుని ఆశీర్వాదం పొందాలంటే?




దేవుని ఆశీర్వాదం పొందాలంటే?

ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.

యోబు 1: 1

ప్రియులారా 

బైబిల్ లో యోబు గ్రంథనికి చాలా ప్రాముఖ్యత ఉంది 

జీవితంలో ఎన్ని శ్రమలొచ్చిన ఓపికతో ఎలా సహించాలో యోబు గ్రంధాన్ని చదివితే మనకర్థమవుతుంది బైబిల్ లొ యోబు గ్రంధమే ఉండి ఉండకపోతే ఎంతో మంది ఆత్మీయులు వారికొచ్చిన శ్రమలకు తాళలేక ఇప్పటికె వారి తనువు చాలించి ఉండేవారు 

యోబు బహు శ్రమల గుండా వెళ్ళాడు అయితే వాటన్నింటిని సహించి చివరివరకు తన నీతిని విడువకుండా ఉన్నాడు దేవుడు యోబును బహుగా ఆశీర్వదించాడు తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు 

అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి.

అతనికి ఏడువేల గొఱ్ఱెలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను

ప్రియులారా దేవుడు యోబును ఇంతగా ఆశీర్వదించడానికి గల కారణాలేంటి అని మనం ఆలోచన జేస్తే యోబులో కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు మనకు కనిపిస్తాయి ఆ లక్షణాలే మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు మనలను కూడా తప్పక ఆశీర్వదిస్తాడు 

మొదటగా మనం చూస్తే యోబు ఒక యదార్థవర్తనుడుగా ఉన్నాడు 

ప్రియులారా 

యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది అని వ్రాయబడి ఉంది దేవుడు యదార్థ వంతులను బలపరుస్తాడు యదార్థ వంతులకు ఆయన తోడుగా ఉంటాడు 

యోసేపు జీవితాన్ని మనం చూస్తే యోసేపుకు ఎన్ని  శ్రమలొచ్చినా ఎన్ని శోధనలోచ్చిన వాటన్నింటిని సహిస్తూ దేవుని దృష్టికి యథార్థముగా జీవించాడు దేవుడు యోసేపుకు తోడై యుండి అతని బహుగా ఆశీర్వదించాడు ఐగుప్తు దేశానికే ప్రధాన మంత్రిగా చేసాడు 

ప్రియులారా మనము యధార్థంగా జీవించినట్లైతే దేవుడు మనకు తోడై యుండి మనలను ఆశీర్వదించుటకు ఆయన చాలినవాడు 

యోబు జీవితాన్ని మనం చూస్తే అతినిలో ఉన్న రెండవ ప్రాముఖ్యమైన లక్షణం అతడు న్యాయవంతుడు 

న్యాయంగా మాట్లాడేవాడు న్యాయంగా ప్రవర్తించేవాడు న్యాయంగా సంపాదించేవాడు అన్యాయము అనే మాటే యోబులో లేదు 

అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము.అని వాక్యం సెలవిస్తోంది

ప్రియులారా 

యాకోబు జీవితాన్ని మనం గమనిస్తే యాకోబు తన మామ యైన లాబాను దగ్గర న్యాయంగా పనిచేశాడు లాబాను యాకోబు జీతాన్ని పది మార్లు మార్చాడు 

అయినప్పటికీ దేవుడు యాకోబును బహుగా ఆశీర్వదించాడు 

లాబాను పొడలు గలవి నీ జీతమగునని యాకోబుతో చెప్పినయెడల అప్పుడు మందలన్నియు పొడలుగల పిల్లలనీనెను. చారలుగలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు చారలుగల పిల్లల నీనెను. ఈ ప్రకారముగా దేవుడు  యాకోబును అత్యధి కముగా అభివృద్ధిపొందించి విస్తార మైన మందలు ఒంటెలు గాడిదలు అతనికి దయచేసెను 

సహోదరి సహోదరులారా 

మనము న్యాయంగా జీవించినట్లైతే 

మనం చేసే పనులన్నింటిలో దేవుడు మనకు తోడై ఉండి మనలను ఆశీర్వదిస్తాడు 

యోబు జీవితాన్ని మనం చూస్తే అతినిలో ఉన్న మూడవ ప్రాముఖ్యమైన లక్షణం అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.

ప్రియులారా యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట చెడుతనము విసర్జించుటయే అని వ్రాయబడి యుంది 

యెహోవాను ప్రేమించువారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది 

నిజంగా మనము దేవుని యందు భయభక్తులు గలవారమైతే ఏ పాపానికి కూడా మన హృధములో చోటివ్వకుండా పరిశుద్ధంగా జీవిస్తాం

పాపం మనల్ని దేవునికి దూరం చేస్తుంది 

పాపం దైర్యంగా మనము దేవుని సన్నిధికి వెళ్లకుండా అడ్డుపడుతుంది 

పోతీఫర్ భార్య యోసేపును శోధించి తనతో పాపం చేయమన్నపుడు యోసేపు 

నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందునని అక్కడినుండి వెళ్లి పోయాడు 

ప్రియులారా

పాపమునకు దూరముగా పారిపోవుడి 

పరిశుద్ధముగా జీవించుటకు పరితపించుడి 

మనము యధార్థముగా న్యాయముగా జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినప్పుడే దేవుని ఆశీర్వాదాలను మన జీవితములో చూడగలం 

గనుక నెను దేవుని యందు భయభక్తులు కలిగి 

చెడుతనమును విసర్జించి యధార్థముగా న్యాయముగా జీవిస్తాను అన్నవారు నాతో పాటు ప్రార్ధనలొ ఏకీభవించండి 

పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి 

యోబు జీవితం ద్వారా నీవు మాతో సూటిగా మాట్లాడినందుకు నీకు స్తోత్రములు 

తండ్రి మేము యోబు వలె యధార్థముగా న్యాయముగా జీవిస్తూ నీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించెవారముగా ఉండుటకు సహాయం దయచేయుమని నీ ఆశీర్వాదాలు మేము  పొందుకుని అనేకులకు ఆశీర్వాదకరముగా మారుటకు  కృపచూపమని

యేసుక్రీస్తు నామమున ప్రార్ధిస్తున్నాము తండ్రి 


1 comment:

  1. Chala chakkani sandesam andinchina miku na hrudayapurvaka vandanamulu brother🙏

    ReplyDelete