Breaking

Monday, 9 November 2020

Daily bible verse in telugu




భూమ్యాకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతి నొందునుగాక. 2దినవృత్తాంతములు 2: 12 ప్రియులారా మన దేవుడు తన నోటి మాట ద్వారా సర్వ సృష్టిని సృజించిన వాడు అటువంటి మహా శక్తి గల దేవుడు మన చెయ్యి పట్టుకొని నిన్ను విడువను నిన్నెన్నడు ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నాడు. మన కోసం తన ప్రాణాలను సహితం అర్పించిన దేవునితో ప్రేమలో నిలిచియుండటం మనకు దేవుడిచ్చిన గొప్ప వరం దేవుడే మనలను కాపాడుతు ఏ కీడు మనకు రాకుండా క్షేమంగా జీవింప చేస్తున్నాడు ఇంత గొప్ప దేవుని పిల్లలముగా మనం ఉండుట కృప చూపిన దేవుడు స్తుతినొందును గాక దేవుని వాక్యం ఈ విదంగా చెబుతుంది. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని ప్రియులరా మనం ధన్యులమై యున్నాము. ఆయన మన పట్ల చేసిన కార్యాలను తలుచుకుంటూ ఆయనను స్తుతించువారమై యున్నాము ఇంత గొప్ప దేవుడు మనకు తోడై యుండగా ఏ దిగులు ఏ చింత లేకుండా నెమ్మది గలవారమై జీవిద్దాం ఈ వాక్యం మన సృష్టి కర్త అయినా దేవుడు స్తుతికి పాత్రుడని తెలియజెస్తుంది గనుక ఈ రోజంత ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవున్ని స్తుతించు వారమై జీవిద్దాం దేవుని గొప్ప రక్షణ హస్తం మనకు తోడై యుండును గాక ఆమెన్

No comments:

Post a Comment