Breaking

Tuesday, 24 November 2020

సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి?


సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి?

ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సారి
ఏదో ఒక సమయములో లేక చాలా సార్లు సమస్యలు అనే వలయం గుండా వెళ్తు ఉంటారు సమస్యలు అనే తుఫానులను ఎదుర్కొంటు ఉంటారు
కొన్ని సార్లు మన మీదికి వచ్చే భయంకరమైన తుఫానులను చూసి మనము భయపడి పోతూ ఉంటాము క్రుంగి పోతూవుంటాము
ఈ సమస్య తీరదేమోనని ఈ సమస్యను జయించలేనేమో నని నిరాశ నిస్పృహకు లోనవుతూ ఉంటాము కానీ మనకొచ్చే ప్రతి సమస్యకు పరిష్కారముందని ఆ సమస్యను మనము ధైర్యముగా ఎదుర్కోగలమనే విషయాన్ని గ్రహించాలి
సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలో వాటిని
ఎలా ఎదుర్కోవాలో మన సమస్యలు తీరాలంటే మనము కలిగి ఉండవలసిన లక్షణాలు ఏంటో ఈ ఇప్పుడు చూద్దాం
మొదటగా ఒక వ్యక్తికొచ్చిన కష్టం గురించి ఆ కష్టం యొక్క తీవ్రతను గురించి ఆ కష్టాన్ని అతడు ఎలా  ఎదర్కొన్నాడో అన్న దాని గురించి ఇప్పుడు చూద్దాం
అతడొక గొఱ్ఱెల కాపరి అతన్ని దేవుడు రాజుగా అభిషేకించాడు ఒకరోజు శత్రువులు అతడున్న ప్రాంతానికి వచ్చి అతని పట్టనాన్ని దోచుకొని ఆ పట్టణాన్ని తగులబెట్టి అక్కడున్న  స్త్రీలను పిల్లలను చెరగొనిపోయారు
ఇది తెలుసుకున్న అతడు అతని జనులు తమ భార్య పిల్లలు లేకపోవుట చూచి పట్టనము కాల్చబడి ఉండుట చూచి ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చారు
అతని జనులు తమ కుమారులు కుమార్తెలు లేకపోవుటను బట్టి వారికి కలిగిన కష్టాన్ని నష్టాన్ని
బట్టి వారి ప్రాణము విసిగి తమ నాయకుడైన వానినే  చంపుటకు సిద్ధమయ్యారు
ఇంతకు ఎవరానాయకుడు అతినికున్న ఈ సమస్యను అతడు ఎలా జయించాడు అతడు చేసిన తీర్మాణాలెంటో అతడు చేసిన ప్రయత్నాలేంటో ఇప్పుడు చూద్దాం
అతనెవరో కాదు యేషయి కుమారుడైన దేవుని హృదయానుసారుడైన దావీదు
దావీదు ఇటువంటి పరిస్థితి గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు అతడు మొట్ట మొదటగా చేసిన పని
దేవుణ్ణి ఆశ్రయించడం దేవుని సన్నిధిలో మోర పెట్టడం
చాలా సార్లు మనకు సమస్యలు వచ్చినప్పుడు
దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాము దేవునికి మన సమస్యను చెప్పుకోవాల్సిందానికి బదులుగా మన చుట్టు ఉన్నవారితో పంచుకుంటూ ఉంటాము
కానీ ఎప్పుడైతే మనకు సమస్య వచ్చినప్పుడు
వెంటనే దేవుణ్ణి ఆశ్రయిస్తామో అప్పుడే దేవుడు మన సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడు
దావీదు దేవుని దగ్గరకు వెళ్లి
నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని ఆయన యొద్ద విచారణ చేయగా ఆయన  నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చడు
ప్రియులారా
దావీదు తనకు సమస్య వచ్చిన వెంటనే దేవుణ్ణి
ఆశ్రయించాడు దేవుని సహాయాన్ని కోరాడు
దేవుడిచ్చిన జవాబును బట్టి తన సమస్యకు పరిష్కారాన్ని పొందుకోగలిగాడు
నేను ప్రార్ధిస్తే దేవుడు వింటాడా నా ప్రార్ధనలకు దేవుడు జవాబిస్తాడా అనే అనుమానాలు మీలో కలుగొచ్చు
అయితే మీకు ఒక శుభవార్త దేవుడు పక్షపాతి కాడు   ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు
ఆయనకు మొఱ్ఱ పెట్టు వారికి ఆయనకు నిజముగా మొఱ్ఱ పెట్టు వారికందరికి ఆయన సమీపముగా ఉన్నాడు మనము మన బాధను మన భారాన్ని విశ్వాసముతో ఆయన యెదుట కుమ్మరించవలసినవారమై యున్నాము
దావీదు తన బాధనంత దేవునితో చెప్పుకున్నప్పుడు
దేవుడు దావీదుకు జవాబిచ్చాడు దేవుడు చెప్పిన మాటను బట్టి  అతనియొద్దనున్న ఆరువందల మందితో బయలుదేరి అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను.
కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తికొనిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి యేదియు తక్కువకాకుండ దావీదు సమస్తమును రక్షించెను.
ప్రియులారా
శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ప్రతి ఒక్కరికి వస్తాయి
అవి వచ్చినప్పుడు వాటిని చూసి భయపడకుండా
దేవుని సహాయముతో ధైర్యముగా వాటిని ఎదర్కొనే వాడే జ్ఞానము గలవాడు
నీకున్న సమస్యను మనుషులతో చెప్పుకుంటూ మనుషుల మీద ఆధారపడుతూ మోసపోవడం మానేసి నీ సమస్యను దేవునితో చెప్పి నీకున్న బాధను నీ బారాన్ని ఆయన యెదుట కుమ్మరించు ఆయన సహాయన్ని కోరు
నీ ప్రార్ధనలకు జవాబిచ్చి నీ సమస్యల నుండి నిన్ను విడిపించి గొప్ప సంతోషముతో సమాధానముతో
నీ హృదయన్ని నింపుటకు నా దేవుడు చాలినవాడు


No comments:

Post a Comment