యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.
కీర్తనలు 4: 8
ప్రియులారా దావీదు భక్తుడు తన జీవితంలో ఎక్కువ శాతం ఒంటరి గానే ఉండేవాడు. అతడు చిన్న తనం నుండే దేవునితో మాత్రమే సహవాసం చేసేవాడు. అందుకే దేవుడు దావీదును చూసి ఇతడు నా హృదాయానుసారుడు అని చెప్పాడు. దేవుడే తనకు క్షేమము కలుగజేయువాడని నమ్మిన దావీదు అనేక సార్లు దేవునిపై ఆధారపడ్డాడు. అందుకే ఇశ్రాయేలీయులకు గొప్ప రాజుగా మారాడు.
ఎవరైతే దేవునితో ఉండాలని కోరుకుంటారో వారు దేవుని వలన గొప్ప మేలును పొందుకుంటారు.
ఈ లోకంలో ఆనందం తోను సంతోషం తోను జీవించాలంటే ఆయను ఆశ్రయించి ఆయనతో సహవాసం చేయువారమై ఉండాలి. మనం ఒంటరి వారమని మనకు ఎవరు సహాయం చేసే వారు లేరని
మనకు నిరీక్షణ లేదని నిరాశలోకి సాతాను మనలను పడద్రోస్తాడు. కానీ మనం దేవుని బిడ్డలం అని దేవుడు మనకు ఎల్లవేళలా తోడుగా ఉండి సహాయం చేస్తాడని మనం విశ్వసించాలి. ఎందుకంటే దేవుడు తన ప్రాణం కన్నా మిన్నగా మనలను ప్రేమిస్తున్నాడని మనం గ్రహించాలి.
ఈ వాక్యం మనం దేవుని పై నమ్మకం ఉంచిన యెడల
సురక్షితముగా ఉండగలమని తెలియజేస్తుంది.
గనుక ఈరోజంత ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుణ్ణి ఆశ్రయించువారమై ఉందాం.
దేవుడు మనకు ఆధారమై గొప్ప మేలులు కలుగజేయును గాక. ఆమెన్
No comments:
Post a Comment