నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు.
యోబు 27: 6
ప్రియులారా దేవుని చేత బహుగా ఆశీర్వదించబడిన యోబు తన సర్వస్వము కోల్పొయిన తరువాత ఈ మాటను పలుకుతున్నాడు. ఈ లోకములో తనకు కలిగినదాన్ని బట్టి అతడు అతిశయించలేదు కానీ తన నీతిని బట్టి తన యధార్థతను బట్టి అతిశయపడుతున్నాడు.
ప్రియులారా మన ప్రవర్తన మనకును, దేవునికి మాత్రమే తెలుసు. మనుషుల దగ్గర నటించడం వలన మనకు ప్రయోజనం ఉండదు. నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు అనేమాటను గమనించినట్లైతే మనం మన హృదయ దృష్టికిని, దేవుని దృష్టికిని నీతిమంతులుగా ఉండాలని తెలుస్తుంది. గనుక మన ప్రవర్తన విషయమై మన హృదయం మనలను నిందించకుండా చూచుకునేవారమై యుందాము. ఏ ఏ విషయాలలో మన హృదయం మనలను నిందిస్తుంటే గమనించి ఆ విషయంలలో మన ప్రవర్తనను మార్చుకోనువారమై ఉందాం. అప్పుడే దేవుని దృష్టికి నీతిమంతులమై ఉంటాము.
ఈ వాక్యం మన ప్రవర్తన విషయమై మన హృదయం మనలను నిందించకుండా ఉండాలని మనకు తెలియజేస్తుంది.
గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిద్దాం. దేవుడు తన దృష్టికి మనలను నీతిమంతులుగా మార్చును గాక. ఆమెన్
No comments:
Post a Comment