Breaking

Saturday, 12 September 2020

Daily bible verse in telugu

 



యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు

కీర్తనలు 145: 14

ప్రియులారా మన దేవుడు ప్రేమ, జాలి గలవాడు ఆయన మనలను ఎన్నడూ విడనాడడు. ఒక వేల మనం పాపం లో పడిపోయినప్పటికీ, శ్రమలలో కృంనప్పటికీ ఆయనే మనలను ఆదరించి లేవనెత్తువాడై యున్నాడు. 

నయోమి తన భర్తను తనకు కలిగిన కుమారులను కోల్పోయి ఎంతో దీనస్థితిలో కృంగిపోయినప్పటికీ రూతు ద్వారా తన జీవితాన్ని లేవనెత్తి తనకు గొప్ప 

ఆదరణ కలుగజేశాడు. 

మన స్థితి ఏదైనా మనలను ఆదరించు దేవుడు మనకు తోడైయున్నాడని మనం గ్రహించి ఆయనను ఆశ్రయించువారమై యుండాలి. అప్పుడే దేవుడు మన ద్వారా ఆయన నామాన్ని మహిమ పరుచుకుంటాడు. 

లోకంలో ఎవరికీ లేని ఇంత గొప్ప భాగ్యాన్ని మనం కలిగియున్నందుకు ప్రతి దినం ఆయనకు స్తుతించు వారమై యున్నాము. 

మనం కూడా ఆయన పోలికలో జీవిస్తూ ఆయన అదరనను ఇతరులకు చూపువారమై యున్నాము 

ఈ వాక్యం మనం పడిపోయి కృంగిన స్థితిలో ఉన్నాను దేవుడు మనకు  తోడై మనలను లేవనెత్తువాడై యుండుననే ధైర్యాన్ని కలుగజేస్తుంది. గనుక ఈ  రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని ఆదరణ పొందుకుందాము. 

దేవుడు మనలను గొప్పగా ఆశీర్వదించును గాక. ఆమెన్

No comments:

Post a Comment