Breaking

Tuesday, 17 September 2019

Bible story of esther | bible stories in telugu | ఎస్తేరు


బైబిలు గ్రంథంలో చాలా మంది స్త్రీలను గురించి వ్రాయబడింది వారిలో కొందరి పేర్లు వ్రాయబడలేదు. కాని వారి గొప్ప తనాన్ని గురించి వ్రాయబడింది. బైబిలులో రెండు గ్రంథములు మాత్రమే స్త్రీల పేర్లతో వున్నవి. అవి రూతు, ఎస్తేరు అను గ్రంథములు. ఎస్తేరు యూదురాలు. ఆమె చాల అందమైన రూపము, సుందరమైన ముఖము గలిగిన స్త్రీ. ఎస్తేరు అను మాటకు నక్షత్రము అని అర్ధము. ఎస్తేరుకు హెబ్రీ భాషలో హదస్సా(గొంజి చెట్టు) అను పేరు కూడ వున్నది. పారసీక దేశాన్ని అహష్వేరోషు అను రాజు పరిపాలించేవాడు. అతడు కూషు దేశము మొదలుకొని హిందూదేశము వరకు నూట యిరువది ఏడు సంస్థానములకురాజై పరిపాలన చేశాడు. అతడు తన వైభవానికి, అధికారానికి తగిన విధంగా అధికారులకు, సంస్థానాధిపతులకు, ప్రజలకు ఏడు దినములు గొప్ప విందు చేశాడు. మహారాణి వడ్డీ కూడా స్త్రీలకు గొప్ప విందు చేసింది. రాజు తన అధిపతులకు, ప్రజలకు మహారాణి యొక్క సౌందర్యాన్ని చూపాలనుకొన్నాడు. ఆమె మంచి బట్టలు ధరించి, తల పైకిరీటం కూడ ధరించి
సభకు రావాలని సేవకుల ద్వారా కబురుపంపించాడు. రాణి అందుకు యిష్టపడలేదు. రాజు ఈ తిరస్కారాన్ని అవమానంగా భావించాడు. తన మంత్రుల సలహా ప్రకారం ఆమెను తిరస్కరించాడు.
పారసీక దేశంలో వుంటున్న కన్యకలలో చాలా అందమైన ఒకరిని రాణీగా స్వీకరించాలని నిర్ణయం చేయబడింది. చాలా మంది కన్యకలు పిలిపించబడ్డారు. వారిలో ఎస్తేరు అను యువతి రాజుకు బాగా నచ్చింది. ఎస్తేరు యూదా వంశస్తురాలు. యాయీరు వంశస్తుడైన "మొరైకె" అను
యూదుని పినతండ్రి కుమార్తె, రాజు ఎస్తేరు అందాన్ని చూసి సంతోషించాడు. మొర్దికై యిచ్చిన సలహా ప్రకారం ఎస్తేరు తాను యూదురాలు అన్న సంగతి
మాత్రం చెప్పకుండా రహస్యంగా వుంచింది. ఎస్తేరు యొక్క యోగ క్షేమాలు తెలిసికొనేందుకై మొరెకె ప్రతిరోజూ అంతఃపురం దగ్గర తిరుగుతుండేవాడు.
బిడ్డాను, తెరేషు అను యిద్దరు ద్వార పాలకులు వుండేవారు. వాళ్లు రాజును చంపాలని కుట్ర చేశారు. వారి మాటలు వినిన మొర్ధికై ఆ రహస్యం ఎస్తేరుతో చెప్పాడు. ఎస్తేరు రాజుతో చెప్పింది. రాజు విచారించగా కుట్ర నిజమని రుజువైంది. ఆ యిద్దరు సిపాయిలకు ఉరిశిక్ష విధించబడింది. మొత్తెకై రాజుకు చేసిన ఉపకారాన్ని గురించి రాజ్య సమాచార గ్రంథంలో వ్రాయబడింది.

రాజగు అహహ్వేరోషు అగాగీయుడైన హామాను అను వాడిని ఎక్కువ గౌరవించి, ఆదరించాడు. తన సింహాసనం దగ్గర ఉన్నతాసనం వేయించాడు.
అందరు హామానుకు నమస్కారం చేయసాగారు. కాని మొర్ధికై మాత్రం నమస్కారం చేయలేదు. నేను యూదుణ్ణి, యితరులకు నమస్కరింపను,
అనేవాడు. ఈ విషయం గమనించిన హామాను మొర్దెకై మీద పగబట్టాడు. యూదులందరి మీద కోపంగా వున్నాడు. ఒక రోజు రాజుతో యూదులందరు పొగరుబోతులనీ,రాజు ఆజ్ఞలను గైకొనే వాళ్లు కాదనీ చాడీలు చెప్పాడు.

రాజు యూదులందర్నీ అదారు అనే 12వ నెల 13వ రోజున ఒకేరోజు చంపి వేయాలని, అధికారులకు, సంస్థానముల అధిపతులకు ఆదేశాలు పంపించాడు. ఈ విషయం తెలిసిన మొర్ధికై చాల బాధపడ్డాడు. రాజును బ్రతిమిలాడి ఎలాగైనా యూదుల ప్రాణాలు కాపాడమని ఎస్తేరుకు చెప్పి పంపాడు."ఈ మంచి పని
కోసమే నీవు రాణివి అయ్యావేమో కనుక మన జాతివారికి ఈ సాయం చేయమని" చెప్పి పంపాడు.

ముందుగా అనుమతి లేకుండా ఎవరూ రాజు దగ్గరికి వెళ్ళకూడదు. రాజుకు కోపం రావచ్చు. ఈ సంగతి తెలిసి కూడ ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్లాలని తీర్మానించుకొన్నది. ఆమె రాజవస్త్రాలు, ఆభరణాలు ధరించి రాజు యెదుటికి వెళ్ళింది. గాజు ఆమెను చూశాడు. ఎందుకు వచ్చావని అడిగాడు?
ఎస్తేరు అసలు విషయం చెప్పలేదు. రేపు తమరు, హామాను నా నగరుకు విందుకు దయ చేయండి అని ఆహ్వానించింది. హామాను యింటికి వెళ్లాడు.
తన భార్యతో అన్ని విషయాలు చెప్పాడు. మొద్దెకైని రాజగుమ్మం వద్ద చూస్తూవున్నంత వరకు నాకు మనశ్శాంతి లేదని చెప్పాడు. అందుకు అతని భార్య,
స్నేహితులు ఒక సలహా యిచ్చారు. “నీవు యాభైమూరల ఎత్తుగల ఒక ఉరికొయ్యను చేయించు. రాజాజ్ఞను పొంది మొరైకైని దానిమీద ఉరితీయించు”
అని సలహా యిచ్చారు. హామాను ఒక ఉరికొయ్యను సిద్ధం చేయించాడు.

ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. ఆయన రాజ్యపు సమాచార గ్రంథము చదివించుకొని వింటున్నాడు. దానిలో మొర్ధికై కుట్రదారుల నుండి రాజును
కాపాడిన సంగతి విన్నాడు. బదులుగా రాజు అతనికి ఏమీ సన్మానం (గౌరవం) చేయలేదనికూడ తెలిసికొన్నాడు. రాజు మొర్ధికైని సన్మానించాలనుకొన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన హామానుతో “రాజు ఘన పరచాలని ఉద్దేశించే వారిని
ఏ విధంగా ఘనపరచాలి?” అని అడిగాడు. హామాను రాజు తననుగొప్పగా ఘనపరచబోతున్నాడని అనుకొన్నాడు. మనసులో చాల సంతోషించాడు. "రాజా! తాము ఘనపరచనుద్దేశించువానికి రాజు ధరించే వస్త్రములను, కిరీటాన్ని దరింపజేసి, రాజు ఎక్కే గుర్రం పై అతనిని ఎక్కించి, రాజ వీధులలో ఊరేగించుచూ, రాజు ఘనపరచాలనుకొనే వానికి ఈ విధంగా జరుగుతుంది అని ఒక ఘనుని ద్వారా చాటింపు వేయించాలి” అన్నాడు.

అప్పుడు రాజు "నేను మొరైకైని నీవు చెప్పిన విధంగా సన్మానించాలను కొన్నాను. నీవు గుర్రం వెంబడి నడుస్తూ చాటింపు వేయించు" అని ఆజ్ఞాపించాడు. హామాను తలచింది ఒకటైతే, జరిగింది వేరొకటి. అతడు రాజు చెప్పినట్లు చేశాడు. తర్వాత విచారంతో యింటికి వెళ్లాడు. జరిగిన విషయమంతా భార్యకు వివరించాడు. అంతలో రాణివాసం నుండి భటులు వచ్చి విందుకు రమ్మని ఆహ్వానించారు.

విందుజరుగుతున్నది. రాజు ఎస్తేరు రాణి యెడల చాల ప్రసన్నంగా వున్నాడు. “నీకేమి కావాలో కోరుకో, నా రాజ్యంలో సగం కోరుకొన్నా యిస్తాను” అన్నాడు. అందుకు ఎస్తేరు రాజుతో “రాజా! ఒక దుష్టుడు నా ప్రాణాలను, నా జనుల ప్రాణాలను తీయడానికి కుట్ర చేశాడు. మీరు మమ్మల్ని కరుణించి, మా ప్రాణాలు కాపాడండి'' అని విన్నవించింది. అప్పుడు రాజుకు చాల కోపం వచ్చింది. “మీ ప్రాణాలు తీయాలని కుట్ర చేసిన ఆ దుర్మార్గుడు ఎవరు?” అని అడిగాడు. అందుకు ఎస్తేరు “మీ ఎదుట వున్న ఈ హామాను అను వాడే ఆ కుట్ర చేసిన వారు” అని చెప్పింది.

రాజు వెంటనే హామానును ఉరితీయమని ఆజ్ఞాపించాడు. మొర్దెకై కోసం తయారు చేయించిన ఉరికొయ్య పైనే హామాను ఉరి తీయబడ్డాడు. తాను
తవ్విన గుంటలో తానే పడ్డాడు. అనే సామెత హామాను విషయంలో నిజమైంది. మొర్దెకైని రాజు హామానుకు బదులు ప్రధానిగా నియమించాడు. ఈ విధంగా ఎస్తేరు రాణి స్థానంలో వుండి తన ప్రజల ప్రాణాలను కాపాడింది.

ధ్యానాంశములు :
1. ఈ గ్రంథములో దేవుడు, యెహోవా అను మాటలేలేవు.
2. ఎస్తేరు గ్రంథాన్ని యూదులు చాల భక్తి భావంతో చదువుతారు.
3. ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి, రాజు దగ్గరికి వెళ్ళి, ఆయనతో మాట్లాడి,
తన ప్రజల ప్రాణాలు కాపాడింది. మనం కూడా మంచిపని చేయడానికి వెనుదీయరాదు.

బంగారు వాక్యము :
“స్త్రీలందరి కంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే
ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను." ఎస్తేరు 2:17-12


No comments:

Post a Comment