Telugu bible quiz

Breaking

Saturday, 30 November 2024

November 30, 2024

భజన చేయుచు భక్తపాలక - Bhajana Cheyuchu Bhakthapaalaka song lyrics

 



Bhajana Cheyuchu Bhakthapaalaka song lyrics  :


భజన చేయుచు భక్తపాలక

ప్రస్తుతింతు నీ నామమును (2)

వృజినములపై జయము నిచ్చిన (2)

విజయుడా నిను వేడుకొందు ||భజన||


1.దివ్య పదవిని విడిచి నీవు

దీనుడవై పుట్టినావు (2)

భవ్యమైన బోధలెన్నో (2)

బాగుగా ధర నేర్పినావు ||భజన||


2.నరుల గావను పరమునుండి

ధరకు నీవు వచ్చినావు (2)

పరుడ నైన నా కొరకు నీ (2)

ప్రాణము నర్పించినావు ||భజన||


3.చెడినవాడ నైన నన్ను

జేరదీసి ప్రోచినావు (2)

పడిన నాడు గోతి నుండి (2)

పైకి లేవనెత్తి నావు ||భజన||


4.ఎంత ప్రేమ ఎంత దయ

ఎంత కృప యేసయ్య నీకు (2)

ఇంతయని వర్ణింప నిలలో (2)

నెవనికిని సాధ్యంబు కాదు ||భజన||


Friday, 29 November 2024

November 29, 2024

భజియింతుము రారే - Bhajiyinthumu Raare song lyrics




Bhajiyinthumu Raare song lyrics :


భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో

గళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో (2)

కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము (4) ||భజియింతుము||


1.రారాజు క్రీస్తు రమ్యముగా సేవించి

ప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి (2)

సుందరుడగు యేసు నామం (2)

స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము||


2.పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలు

పరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు (2)

పాపముల వీడి యేసుని (2)

స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము||


Thursday, 28 November 2024