Breaking

Thursday, 30 May 2024

పరవాసిని నే జగమున ప్రభువా - Paravaasini Ne Jagamuna Prabhuvaa



Paravaasini Ne Jagamuna Prabhuvaa song lyrics


పరవాసిని నే జగమున ప్రభువా (2)

నడచుచున్నాను నీ దారిన్

నా గురి నీవే నా ప్రభువా (2)

నీ దరినే జేరెదను

నేను.. నీ దరినే జేరెదను ||పరవాసిని||


లోకమంతా నాదని యెంచి

బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2)

అంతయు మోసమేగా (2)

వ్యర్ధము సర్వమును

ఇలలో.. వ్యర్ధము సర్వమును ||పరవాసిని||


ధన సంపదలు గౌరవములు

దహించిపోవు నీలోకమున (2)

పాపము నిండె జగములో (2)

శాపము చేకూర్చుకొనే

లోకము.. శాపము చేకూర్చుకొనే ||పరవాసిని||


తెలుపుము నా అంతము నాకు

తెలుపుము నా ఆయువు యెంతో (2)

తెలుపుము ఎంత అల్పుడనో (2)

విరిగి నలిగియున్నాను

నేను.. విరిగి నలిగియున్నాను ||పరవాసిని||


ఆ దినము ప్రభు గుర్తెరిగితిని

నీ రక్తముచే మార్చబడితిని (2)

క్షమాపణ పొందితివనగా (2)

మహానందము కలిగే

నాలో.. మహానందము కలిగే ||పరవాసిని||


యాత్రికుడనై ఈ లోకములో

సిలువ మోయుచు సాగెదనిలలో (2)

అమూల్యమైన ధనముగా (2)

పొందితిని నేను

యేసునే.. పొందితిని నేను ||పరవాసిని||


నా నేత్రములు మూయబడగా

నాదు యాత్ర ముగియునిలలో (2)

చేరుదున్ పరలోక దేశము (2)

నాదు గానము ఇదియే

నిత్యము.. నాదు గానము ఇదియే ||పరవాసిని||


Click here : 

Christian songs lyrics in telugu

No comments:

Post a Comment