Breaking

Wednesday 29 May 2024

నా స్తుతుల పైన నివసించువాడా - Naa Sthuthula Paina Nivasinchuvaadaa

 

Click on image

Naa Sthuthula Paina Nivasinchuvaadaa song lyrics :


నా స్తుతుల పైన నివసించువాడా

నా అంతరంగికుడా యేసయ్యా (2)

నీవు నా పక్షమై యున్నావు గనుకే

జయమే జయమే ఎల్లవేళలా జయమే (2)


1.నన్ను నిర్మించిన రీతి తలచగా

ఎంతో ఆశ్చర్యమే

అది నా ఊహకే వింతైనది (2)

ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి

ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2) ||నా స్తుతుల||


2.ద్రాక్షావల్లి అయిన నీలోనే

బహుగా వేరు పారగా

నీతో మధురమైన ఫలములీయనా (2)

ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే

విజయుడా నీ కృప చాలును నా జీవితాన (2) ||నా స్తుతుల||


3.నీతో యాత్ర చేయు మార్గములు

ఎంతో రమ్యమైనవి

అవి నాకెంతో ప్రియమైనవి (2)

నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి

పది తంతుల సితారతో నిన్నే కీర్తించెద (2) ||నా స్తుతుల||


Click here : 

Christian songs lyrics in telugu



No comments:

Post a Comment