Breaking

Tuesday 7 May 2024

కన్నుల జారిన కన్నీళ్లు - kannula jaarina kannillu song lyrics

 

Click on image





kannula jaarina kannillu song lyrics :


కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు 

ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు (2)

ఉందిలే దీవెన... ఎందుకావేదన...

పొందిన యాతన... దేవుడే మరచున (2) 


1.పలుకాకి లోకం నిందించిన

ఏకాకివై నీవు రోదించిన (2)

అవమాన పర్వాలు ముగిసేనులే 

ఆనంద గీతాలు పాడేవులే

"నవ్వినోల్లంతా నీ ముందు

తలను వంచేరు ఇక ముందు" (2) [ఉంది లే ]

                                                      

2.అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన 

ఆత్మీయుల ప్రేమ నిదురించిన (2)

అసమానమైన నా దేవుని 

బలమైన బాహువు నిను వీడునా 

"యేసు నిలిచాడు నీ ముందు 

నీకు చేసెను కనువిందు" (2) [ఉంది లే ]


Click here :

Christian songs lyrics in telugu






No comments:

Post a Comment