Breaking

Sunday 10 September 2023

Yelo Yelo Yelo Antu | ఏలో ఏలో ఏలో అంటూ

 ఏలో ఏలో ఏలో అంటూ – వచ్చారండి గొల్లలు

సంతోషాలే పొంగేనండి – హైలెస్సా
దారే చూపే దేవుడొచ్చే – ఉల్లాసంగా ఊరు ఆడే
సంగీతాలే పాడాలండి – హైలెస్సా
అంధకారాన్ని తొలగించే మహనీయుడు
పుట్టినాడండి యేసయ్య మన దేవుడు
నిన్నే కోరి – నిన్నే చేరి
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు     ||ఏలో||

లోకాలనేలేటి రారాజురా – ఉదయించే సూరీడై వచ్చాడురా
ఆకాశ వీధి – మెరిసేటి దారి – ఒక తార మురిసిందిగా (2)
దూతాళి పాడి – కొలిచారు చూడు – ఘనమైన ఒక వేడుక
ఆ గొల్లలేగా – దరువేసే చూడు – మెస్సయ్య పుట్టాడని
మన మెస్సయ్య పుట్టాడని        ||ఏలో||

వెన్నెల్లో పూసింది ఓ సందడి – పలికింది ఊరంతా ఈ సంగతి
ఈ దీనుడంట – పసిబాలుడంట – వెలిసాడు మహరాజుగా (2)
మనసున్నవాడు – దయ చూపువాడు – అలనాటి అనుబంధమే
కనులారా చూడు – మనసారా వేడు – దిగి వచ్చె మనకోసమే
ఇల దిగి వచ్చె మనకోసమే        ||ఏలో||

ఆ నింగి తారల్లా వెలగాలిరా – జగమంత చూసేలా బ్రతకాలిరా
వెలిగించు వాడు – మనలోని వాడు – నిలిచాడు మన తోడుగా (2)
సలి గాలి రాత్రి – పిలిసింది సూడు – మనలోన ఒక పండగ
భయమేల నీకు – దిగులేల నీకు – యేసయ్య మనకుండగా
మన యేసయ్య మనకుండగా        ||ఏలో||

No comments:

Post a Comment