Aashrayudaa Naa Abhishikthudaa song lyrics :
ఆశ్రయుడా నా అభిషిక్తుడా
నీ అభీష్టము చేత నను నడుపుచుండిన
అద్భుత నా నాయకా
యేసయ్య అద్భుత నా నాయకా
స్తోత్రములు నీకే స్తోత్రములు (2)
తేజోమయుడయిన ఆరాధ్యుడా (2)
నీ ఆలోచనలు అతి గంభీరములు
అవి ఎన్నటికీ క్షేమకరములే
మనోహరములే కృపాయుతమే (2)
శాంతి జలములే సీయోను త్రోవలు (2)
నీతి మార్గములో నన్ను నడుపుచుండగా
సూర్యుని వలె నే తేజరిల్లెదను
నీ రాజ్య మర్మములు ఎరిగిన వాడనై (2)
జీవించెదను నీ సముఖములో (2)
సువార్తకు నన్ను సాక్షిగా నిలిపితివి
ఆత్మల రక్షణ నా గురి చేసితివి
పరిశుద్ధతలో నే నడిచెదను (2)
భళా మంచి దాసుడనై నీ సేవలో (2)
No comments:
Post a Comment