Breaking

Wednesday, 14 June 2023

ఆశతో నీ కొరకు - Aashatho Nee Koraku

 



Aashatho Nee Koraku song lyrics : 


ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా .

నూతన బలముతో నను నింపినావు (2)

బలహీనులను బలపరచువాడా

కృంగిన వారిని లేవనెత్తువాడా (2)

యేసయ్యా నా ఆశ్రయమా

యేసయ్యా నీకే ఆరాధన (2)         ||ఆశతో||


సొమ్మసిల్లక అడుగులు తడబడక

నడిచెద నీ వెంట జీవితమంతా (2)

లోకము నన్ను ఆకర్షించినా

వెనుదిరుగక నేను సాగెద నీ వెంట (2)     ||యేసయ్యా||


అలయక నేను పరుగెత్తెదను

అంతము వరకు ఆత్మల రక్షణకై (2)

సిద్ధము చేసిన బహుమానముకై

గురియొద్దకే నేను సాగెదనయ్యా (2)      ||యేసయ్యా||


రెక్కలు చాపి పక్షి రాజువలెనే

పైకెగెరెద నీ పరిశుద్ధులతో (2)

పరవశించెదను నీ ముఖమును చూచి

ప్రణమిల్లెద నీ పాదముల చెంత (2)       ||యేసయ్యా||













No comments:

Post a Comment