Sree yesu namam shakthi gala namam :
శ్రీ యేసు నామం శక్తి గల నామం
పాపికి పుణ్య నామం
ఎల్లనామములకెల్ల మేలైన నామం
యేసుని దివ్య నామం
సర్వజనులెల్ల సర్వలోకమంతా
హర్షముతో పాడు నామం ( శ్రీ యేసు నామం )
పాప పరిహారమిచ్చి పాపులను రక్షింప
పుడమికెతెంచే నామం
పాప రహిత జీవితం ప్రసాదించే నామం
పరిశుద్ద పుణ్య నామం ( శ్రీ యేసు నామం )
ఎంత గోర పాపమైన ఎంత మొత్తమైన
క్షమించు యేసు నామం
పాపపరితముతో ప్రభు పాదం చేరిన
కాపునిచ్చు కృప నామం ( శ్రీ యేసు నామం )
పాప చింతలన్నియు పారద్రోలు నామం
ప్రభు యేసు పుణ్య నామం
నిత్య శాపం బాపి సత్య మార్గం జూపి
నిత్య రాజ్యం చేర్చు నామం ( శ్రీ యేసు నామం )
No comments:
Post a Comment