Breaking

Monday 10 May 2021

Yehovanu sannuthinchedhanu | యెహోవాను సన్నుతించెదన్

 


యెహోవాను సన్నుతించెదన్
ఆయనను కీర్తించెదను
ప్రభువును ఘనపరచెదన్
ఆ నామమునే గొప్ప చేసెదన్ [2]
హల్లెలూయా హల్లెలూయా [2]


1.నాకున్న సర్వము నన్ను విడచినను
నావారే నన్ను విడచి నిందలేసినను [2]
నా యేసయ్యను చేరగా
నేనున్నానన్నాడుగా [2]
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి
యుగయుగములు చెల్లును [2]


2.నాకున్న భయములే నన్ను కృంగదీయాగా
నా హృదయం నాలోనే నలిగిపోయేగా [2]
నా యేసయ్యను చేరగా
నన్నాదరించెనుగా [2]

ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి
యుగయుగములు చెల్లును [2]


3.నా ఆశలే నిరాశలై నిస్పృహలో ఉండగా
నాపైన చీకటియే నాన్నవరించెగా [2]
నా దీపము ఆరుచుండగా
నా యేసయ్య వెలిగించెగా [2]
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి
యుగయుగములు చెల్లును [2]










No comments:

Post a Comment